త్రిదండి చినజీయర్ స్వామి ఇంట్లో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తల్లి అలివేలుమంగ(85) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో చినజీయర్ స్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్.. చినజీయర్ ఆశ్రమంలో కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ను కలిసి కేసీఆర్ సానుభూతి తెలిపారు.
కేసీఆర్తో మైంహోం రామేశ్వరరావు కూడా స్వామిని పరామర్శించారు. ఆదివారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ ద్వారా చిన్నజీయర్ స్వామిని పరామర్శించారు.