కరోనా పై కేసీఆర్ హై ఎలర్ట్


తెలంగాణలో కరోనా నియంత్రణ పద్ధతులను యథావిధిగా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. కరోనా కట్టడి, రోగులకు అందుతున్న చికిత్స, లాక్‌డౌన్‌ అమలు తీరుపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై వీరితో చర్చించారు.

దేశంలో, రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతూనే ఉందని.. యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్‌ సూచించారు. లాక్‌డౌన్‌ వల్ల రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎంతమందికైనా పరీక్షలు జరిపి చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. హైదరాబాద్‌ నగరంలోనే ఎక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని.. జీహెచ్‌ఎంసీ పరిధిలో వ్కూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు