ప్రణబ్‌ కు పాదాభివందనం!

kcrప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన నేతలందరిని కలసి కృతజ్ఝతలు తెలిపే పనిలో బిజీగా వున్నారు తెరాస అధినేత కేసీఆర్. ఇప్పటికే సోనియా గాంధీని కుటుంబ సమేతంగా కలసి దన్యవాదాలు తెలిపిన విషయం తెలిసిందే. నిన్న (సోమవారం) రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ప్రణభ్ కేసీఆర్ ను ప్రశంసలతో ముంచేత్తారు. “ఎంతోమంది తమ జీవితకాలంలో సాధించలేని లక్ష్యాన్ని మీరు చేరుకున్నారు. జీవితకాలం పట్టే లక్ష్యాన్ని 15 ఏళ్ల పోరాటంతో సాధించారు. ఈ పోరాటంలో మీ కృషి, నిబద్ధత అభినందనీయం. మీకు అభినందనలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ సుదీర్ఘ పోరాటం, నిబద్ధత, కృషి అభినందనీయం”అంటూ కొనియాడారు దేశ ప్రథమ పౌరుడు. ప్రణబ్ ప్రసంశలతో తీవ్ర ఉద్వేగానికి లోనైనా కేసీఆర్ ఆయనకు పాదాభివందనం చేశారు. ఇక, భవిష్యత్ లో తెలంగాణను అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రణబ్ సూచించారట. కాగా, రాష్ట్రపతి కలసిన తెరాస బృందంలో.. కె.కేశవరావు, మందా జగన్నాథం, వివేక్, జితేందర్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్వర్‌ రెడ్డి, కర్నె ప్రభాకర్, జి.వినోద్, దేశ్‌పతి శ్రీనివాస్.. తదితరులు ఉన్నారు.