కార్మికులకు మేడే శుభాకాంక్షలు -ముఖ్యమంత్రి కేసీఆర్

ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్బంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే గవర్నర్‌ తమిళిసై సౌదర రాజన్.

దేశనిర్మాణంలో కార్మికుల శ్రమను గుర్తించిన రోజు మేడే. శ్రామికుల కష్టాన్ని గుర్తించి గౌరవిద్దాం. కార్మికులంతా ఆరోగ్యం, సంపదతో బాగుండాలని ప్రార్థిస్తున్నా. లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు పాటించి కరోనాపై విజయం సాధించాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు.

జాతి నిర్మాణంలో, నాగరికత వికాసంలో కార్మికుల చెమట, రక్తం ఉన్నాయి. యావత్‌ సమాజం కార్మికవర్గానికి అండగా నిలవాల్సిన తరుణమిదని సీఎం కేసీఆర్‌ కార్మికులు శుభాకాంక్షలు తెలిపారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం భ‌రోసా నిచ్చారు. యావత్ సమాజం కార్మిక లోకానికి అండగా నిలవాల్సిన తరుణమిదని పేర్కొన్నారు. మేడే సందర్భంగా కార్మికులు బయటకు రాకుండానే ఉత్సవాలు జరుపుకోవాలని ముఖ్య‌మంత్రి సూచించారు.