‘‘ప్రధానితో రోజుకు రెండుసార్లు మాట్లాడుతున్నా. మోదీ గారు అడిగితే లాక్‌డౌన్‌ను కొనసాగించాల్సిందేనని చెప్పాను. బతికిఉంటే బలుసాకు తినొచ్చు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించుకోవచ్చు. ప్రాణాల్ని తిరిగి తేలేం కదా. యుద్ధం మిగిల్చే విషాదం చాలా భయంకరంగా ఉంటుంది. అంతులేనిదిగా ఉంటుంది. ఆ విషాదాన్ని దేశం భరించజాలదు’’ అన్నారు కేసీఆర్.
‘‘ఏప్రిల్‌లోని ఈ ఆరు రోజుల్లో రూ.2,400 కోట్ల ఆదాయానికి రూ.6కోట్లు మాత్రమే వచ్చాయి. దిల్లీ వెల్లొచిన 172 మంది ద్వారా 93 మందికి కరోనా సోకింది. కరోనా వల్ల ఆదాయం తగ్గినా మరణాల్లేవు. భారత్‌లాంటి దేశాల్లో లాక్‌డౌన్ తప్ప వేరే మార్గంలేదు. లాక్‌డౌన్ ఎత్తివేస్తే మళ్లీ ఆగమవుతాం’’ అని చెప్పుకొచ్చారు కేసీఆర్.