Site icon TeluguMirchi.com

హాస్పటల్ లో కేసీఆర్..ఆందోళనలో కార్యకర్తలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో ఆయనకు ఆస్పత్రి వైద్యులు అందుకు సంబంధించిన ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ముఖ్యమంత్రి రాక సందర్భంగా యశోదా ఆస్పత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం కుదురుగా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. కేసీఆర్ హాస్పటల్ లో చేరిన విషయం తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా నేతలు , కార్య కర్తలు ఆందోళనలు చెందుతూ ముఖ్యమంత్రి ఆరోగ్యం ఫై ఆరా తీస్తున్నారు.

Exit mobile version