తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు , కేటీఆర్ కుమారుడు హిమాన్షు గాయపడ్డాడని.. ఇంట్లో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో కాలికి ఫ్యాక్చర్ అయ్యిందనే వార్తలు ఉదయం నుండి మీడియా లో హైలైట్ గా నిలిచాయి.
ఈ వార్తలు చూసి రాష్ట్ర ప్రజలు , తెరాస నేతలు , కార్య కర్తలు ఖంగారు పడ్డారు. అయితే తనకు ఏమికాలేదని మీడియా లో వచ్చిన వార్తలన్నీ పుకార్లే నని, రేపు ఉదయం మార్నింగ్ వాక్ కు నేను వెళ్తున్నాని చెప్పి షాక్ ఇచ్చాడు హిమాన్షు. మరి ఆ వార్తలు ఎలా బయటకు వచ్చాయి అనేది అర్ధం కావడం లేదు. హిమాన్షు క్లారిటీ ఇవ్వడం తో అంత హమ్మయ్య అనుకుంటున్నారు.