Site icon TeluguMirchi.com

కేసీఆర్ సర్కార్ రైతులకు ఉచితంగా విత్తనాలు అందించబోతుందా.?

అంటే అవును కావొచ్చని అంత మాట్లాడుకుంటున్నారు. నిన్న కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభం అనంతరం.. రైతులకు త్వరలోనే ఓ శుభవార్త చెబుతానంటూ కేసీఆర్ ఓ ప్రకటన విన్న వారంతా అది ఏమై ఉంటుందని తెలుసుకోవడానికి ఆకస్తి కనపరుస్తున్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రస్తుతం కేసీఆర్ సర్కారు నియంత్రిత పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఈ దిశగా రైతులకు ఉచితంగా విత్తనాలు అందించే అవకాశం ఉండొచ్చనే భావన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలు చొప్పున ఏటా రైతు బంధును అందజేస్తోంది. దీంతోపాటు నియంత్రిత విధానంలో పంటసాగు చేసే రైతులకు ఉచితంగా విత్తనాలు, పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడం, గిట్టుబాటు ధర కల్పించడం లేదా బోనస్ ఇవ్వడం, ఉచితంగా ఎరువులు అందిండం, రైతు బీమా విషయంలో మరేదైనా నిర్ణయం తీసుకోవడం లాంటివి ఏవైనా ఉండొచ్చని అంటున్నారు.

Exit mobile version