Site icon TeluguMirchi.com

రైతులకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్ న్యూస్


తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 25 వేల రూపాయలలోపు ఉన్న రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామని రెండు రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగా… రూ. 1200 కోట్లను గురువారం విడుదల చేసింది.

6 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రుణమొత్తాన్ని జమ చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రూ. 25 వేల లోపు రుణం ఉన్న రైతుల ఖాతాల్లో వెంటనే డబ్బును జమ చేయాలని మంత్రులు చెప్పారు. రూ. 25 వేల కన్నా ఎక్కువ, రు. లక్ష లోపు ఉన్న వారికి నాలుగు విడతల్లో రుణ చెల్లింపులు జరపాలని తెలిపారు.

Exit mobile version