తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఊపిరితిత్తుల్లో మంటగా ఉండటంతో ఆయనకు ఆస్పత్రి వైద్యులు అందుకు సంబంధించిన ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ పరీక్షలు నిర్వ్హయించారు.
వైద్య పరీక్షల పూర్తి అనంతరం కేసీఆర్ ప్రగతిభవన్‌కు బయల్దేరి వెళ్లారు. కేసీఆర్ ఆరోగ్యం కుదురుగా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. కేసీఆర్ హాస్పటల్ లో చేరిన విషయం తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా నేతలు , కార్య కర్తలు ఆందోళనలు చెందుతూ ముఖ్యమంత్రి ఆరోగ్యం ఫై ఆరా తీశారు. అయితే ఆయన క్షేమంగా ప్రగతి భవన్ కు చేరుకోవడం తో ఊపిరి పీల్చుకున్నారు.