పారిశుద్ధ కార్మికులకు కేసీఆర్ కరోనా బోనస్ ప్రకటించారు…

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాల దేశాలు లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇంటికే పరిమితం చేసాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు. ఈ సమయంలో వారి ప్రాణాలు లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడడం లో కీలక పాత్ర పోషిస్తున్న డాక్టర్స్ , పోలీస్ , పారిశుధ్య కార్మికులకు అంత సెల్యూట్ చేస్తున్నారు.

కరోనా వైరస్‌పై పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ కార్మికులకు సీఎం కేసీఆర్ కరోనా బోనస్ ప్రకటించారు. వైద్య సిబ్బంది సేవలకు గుర్తించి.. వాళ్ల గ్రాస్ శాలరీలో 10 శాతం సీఎం గిఫ్ట్ రూపంలో బోనస్‌గా అందజేస్తున్నామని ప్రకటించిన కేసీఆర్.. ఈ మొత్తాన్ని వెంటనే అందజేస్తామన్నారు.

జీహెచ్‌ఎంసీ, హెచ్ఎంస్‌డబ్ల్యూ సిబ్బందికి.. రూ.7500 సీఎం గిఫ్ట్ అందిస్తున్నామన్న ముఖ్యమంత్రి.. మున్సిపాల్టీల్లో పని చేసే పారిశుద్ధ కార్మికులకు రూ.5000 సీఎం గిఫ్ట్‌గా అందిస్తున్నాం అన్నారు. ‘సఫాయి అన్నా.. సలాం అన్నా’ అని కేసీఆర్ నినదించారు. ‘‘కరోనా బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడటంలో కనిపించే దేవుళ్లు మీరు. మీ సేవలను కొనసాగించే కొద్దీ.. ప్రజలను కాపాడిన వాళ్లు అవుతారు. ఈ మొత్తాన్ని ఈ రోజే రిలీజ్ చేయాలని ఆదేశించాం’’ అని సీఎం తెలిపారు.