భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజుల పాటు జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది.
ఈ జాతరకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పట్లు పూర్తి చేశారు. కోటిన్నర కు పైగా భక్తులు ఈసారి హాజరు కాబోతారని చెపుతున్నారు. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, సీఎస్ సోమేష్, డీజీపీ మహేందర్ రెడ్డి తో కలిసి.. ములుగు జిల్లా మేడారంలో శనివారం పర్యటించారు. ఇక సీఎం కేసీఆర్ ఫ్రిబ్రవరి 18 వ తేదీన మేడారం జాతరకు కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని మంత్రులు ప్రకటన చేశారు.