తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌కు ఓ వ్యక్తి అడ్డుతగలడం అందరికి షాక్ కలిగించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి అమరవీరులకు నివాళులర్పించేందుకు గన్‌పార్క్‌కు బయల్దేరారు. సరిగ్గా అదే సమయంలో ఓ యువకుడు కాన్వాయ్ వైపు దూసుకొచ్చి సీఎం కారు డోర్ దగ్గరకు వెళ్లాడు. వెంటనే అది గమనించిన పోలీసులు అప్రమత్తమైన ఆ యువకున్ని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం అతన్ని విచారించిన పోలీసులు నల్గొండ జిల్లా కొండ మల్లేపల్లికి చెందిన హనుమంతు నాయక్‌గా గుర్తించారు. డబుల్ బెడ్రూం ఇల్లు కోసం అతను సీఎం కాన్వాయ్‌కు అడ్డుతగిలానని అతడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. భద్రతా దళాలు పహారా కాస్తున్నా, పోలీసులు చుట్టుముట్టి ఉన్నా కళ్లుగప్పి హనుమంతు నాయక్ కేసీఆర్ కాన్వాయ్‌కు అడ్డు తగలడం గమనార్హం.