Site icon TeluguMirchi.com

రైతుబంధు ఫై పూర్తి క్లారిటీ ఇచ్చిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం ఫై అనేక పుకార్లు ప్రచారం అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. కేసీఆర్‌ బతికున్నంతవరకు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో రైతుబంధు కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు.

‘రైతుబంధు అందరికీ ఇస్తరా? అంటూ కొంతమంది అంటున్నారు. అలాంటి అపుహాలు అవసరం లేదు. ప్రభుత్వం తరఫున నేను స్పష్టంగా చెపుతున్నా.. వర్షాకాలం పంటకు కూడా రూ.7 వేల కోట్లు బాజాప్తా ఇస్తం. వాళ్లకు పంటకు అందేటట్టు మంచిగ ఇస్తం’ అని చెప్పారు. అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా రూ. 25 వేల వరకు రైతురుణాలు ఉన్నవారికి ఒకే దఫాలో మాఫీ చేస్తామని ఆర్థికమంత్రి ప్రకటించినట్లు రూ. 5. 50 లక్షల మంది రైతులకు లాభం చేకూరుతుంది. అందుకు సంబంధించిన రూ.1,200 కోట్లు బుధవారం మంజూరు చేస్తున్నాం.

రెండు, మూడ్రోజుల్లో రైతుల అకౌంట్లలో జమవుతాయి. ఇది రైతులకు మేమిచ్చిన కమిట్‌మెంట్‌.. కచ్చితంగా నెరవేరుస్తం అని పూర్తి స్పష్టత చ్చారు.

Exit mobile version