దేశంలో కరోనా రెండవసారి విజృంభిస్తున్న తరుణంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుండి కరోనా ఎక్కువైతే లొక్డౌన్ విధించే బాధ్యత రాష్ట్రాలకు ఇచ్చారు. ఇదే అదనుగా భావించి కొందరు సోషల్ మీడియాలో తెలంగాణ లో లొక్డౌన్ విధిస్తున్నారు అని ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే కొందరు రాజకీయ నేతలు క్లారిటీ ఇవ్వగా, ఈ రోజు స్వయంగా సీఎం కెసిఆర్ అసెంబ్లీ లో క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో లాక్ డౌన్ ఉండదు,ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. పరిశ్రమల మూసివేత ఉండదు. కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. విద్యాసంస్థలను తాత్కాలికంగానే మూసివేశాము. గతేడాది లాక్ డౌన్ వలన ఆర్ధికంగా చాలా నష్టపోయాం. మాస్కులు ధరించండి, భౌతిక దూరం పాటించండి అని విజ్ఞప్తి చేశారు.