కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్.. ప్రజల ఎదురుచూపు


తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈనెల 19న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. కేంద్ర ప్రభుత్వమిచ్చిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 20 వరకు యథావిధిగా లాక్‌డౌన్‌ అమలవుతుందని, ఆ తర్వాత పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిన్న జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో వెల్లడించారు. ఈనేపథ్యంలో ఈనెల 19న జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

కరోనా నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలు, తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. లాక్‌డౌన్‌ను మే 3వరకు యథావిధిగా కొనసాగించాలా? వద్దా?. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా ఏప్రిల్‌ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇవ్వడమా? అనే అంశాలపై మంత్రివర్గం కీలకంగా చర్చించే అవకాశముంది. కాగా కేసీఆర్ ఈ నెల ముప్ఫై వరకూ లాక్ డౌన్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సమావేశంలో ఇది మోదీ చెప్పిన డేట్ వరకూ వెళ్ళవచ్చు.