తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన కేసీఆర్.. కొందరు నాయకులతో కలిసి ‘టీఆర్ఎస్’ పార్టీని 2001 ఏప్రిల్ 27న స్థాపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్’ అనే మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆ పదమే టీఆర్ఎస్ పార్టీకి పునాదిగా మారింది. తెలంగాణ అనే పదాన్ని శక్తిగా మలుచుకున్నారు. రాష్ట్రానికే పరిమితమైన పార్టీని.. ఇప్పుడు పలు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నేతల మద్దతుతో జాతీయ పార్టీగా మార్చుకున్నారు. అయితే తెర వెనుక మరో ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణ నినాదాన్ని విస్తృతంగా వాడుకున్న కేసీఆర్.. భారత్ అని పేరు పెట్టుకోవడం.. తెలంగాణ ప్రజలు ఈ పదాన్ని ఎలా స్వాగతిస్తారనేది ఆసక్తికరంగా మారింది.