Site icon TeluguMirchi.com

నడుం బిగించిన కేసీఆర్‌

KCR
బంగారు తెలంగాణ లక్ష్యంతో ముందుకు వెళుతున్న కేసీఆర్‌ సర్కార్‌ ఆ దిశగా చర్యలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌ నగరంలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు సీఎం నడుం బిగించారు. బ్రాండ్‌ అంబాసిడర్‌ ఇమేజ్‌ పెంచేందుకు విస్తృతమైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురాబోతుంది తెలంగాణ సర్కార్‌. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రోడ్లు, డ్రైనేజ్‌ వ్యవస్థ, వీధి లైట్లను ఏర్పాటు చేసే దిశగా కేసీఆర్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్‌ను రాపిడ్‌స్పీడ్‌తో అభివృద్ధి చేయబోతున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

Exit mobile version