దసరా రోజున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించనున్నట్లు సమాచారం. గతకొంత కాలంగా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటమే కాకుండా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించారు కేసీఆర్. అక్టోబర్ 5 న దసరా పండుగ కావడంతో దసరా అంటే విజయదశమి ……. విజయదశమి విజయాలకు చిహ్నం కాబట్టి ఆరోజున జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ నాయకులకు కీలక ఆదేశాలు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక దసరా రోజున అంటే అక్టోబర్ 5 న హైదరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లుగా పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. దసరా రోజున సమావేశంలో పలు అంశాలపై చర్చించిన తర్వాత జాతీయ పార్టీ BRS ను ప్రకటించనున్నారట.