Site icon TeluguMirchi.com

కేసీఆర్ .. వార్నింగ్ రాధాకృష్ణకె

నిన్న సిఎం కేసీఆర్.. ఓ మీడియా సంస్థపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. “కొన్ని పత్రికలు కూడా పిచ్చి రాతలు రాస్తున్నయ్‌. వైద్యులకు రక్షణేదీ.. అని రాస్తున్నయ్‌. పీపీఈ కిట్లు లేవా? 40వేలున్నయ్‌ మీకు తెలుసా? అవసరమనుకుంటే కేసులు కూడా పెడతం. ఎంతో చిత్తశుద్ధితో, ధైర్యంగా పనిచేస్తున్న వైద్యుల మనోధైర్యం కోల్పోయేలా వెకిలి వార్తలు రాస్తరా? ఈ సమయంలో ప్రభుత్వానికి, సమాజానికి ఉపయోగపడే వార్తలు రాయాలి. వారికి శిక్ష తప్పదు. ” అని తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు కేసీఆర్ .

ఐతే ఈ హెచ్చరిక ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ కె అని చెప్పాలి. “వైద్య సిబ్బందికి పీపీఈ కిట్ల కొర‌త‌; రాష్ట్రంలో 6118 పీపీఈ సూట్లు-వారం రోజుల‌కు కూడా స‌రిపోని స్థితి” అని ఆంధ్రజ్యోతి ఓ కధనం ప్రచురించింది. దీనిని ఉద్దేశించే కేసీఆర్ ఈ వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి.

Exit mobile version