మాస్క్ లో కేసీఆర్.. తొలిసారి


తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అందరికి కరోనాపై ఓ అవగాన వచ్చింది. అందరూ మాస్కలు పెట్టుకుంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఎప్పుడూ మాస్క్ ధరించలేదు. ప్రగతి భవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించినా.. ప్రెస్ మీట్ పెట్టినా.. సామాజిక దూరం పాటిస్తూ వచ్చారే తప్ప మాస్క్ పెట్టుకోలేదు.

అంతేకాదు ఇటీవల ప్రధాని మోదీ సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో దాదాపు అందరు ముఖ్యమంత్రులు మాస్క్‌లతో కనిపించారు. అప్పుడు కూడా సీఎం కేసీఆర్ మాస్క్ ధరించలేదు. కానీ ఈ రోజు ఆయన తొలిసారిగా మాస్క్ ధరించి కనిపించారు. దేశంలో కరోనా అడుగుపెట్టాక.. ఇన్ని రోజులకు సీఎం కేసీఆర్ సర్జికల్ మాస్క్‌ ధరించారు.