Site icon TeluguMirchi.com

తెలుగు సిఏంలు హై అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు ఒక్కసారిగా పెరగడంతో రాష్ట్రప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి.. రాష్ట్ర ప్రజను ఉద్దేశించి ప్రసంగించాలని నిర్ణయించారు.

ఇదీలావుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌ తమిళి సైతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ పరిస్థితులపై అధికారులతో సమీక్షించిన అనంతరం సీఎం రాజ్‌భవన్‌కు బయల్దేరి వెళ్లారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమెకు వివరించనున్నారు.

Exit mobile version