రెడ్ జోన్ల వరకే లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలని ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి తన అభిప్రాయంగా చెప్పారు. రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జగన్.. రాష్ట్రంలో 676 మండలాల్లో 81 మండలాలను కరోనా ప్రభావిత మండలాలుగా గుర్తించామని తెలిపారు. ఈ మండలాల్లోనే లాక్డౌన్ కొనసాగించాలని కోరారు. జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవచ్చన్నారు. సినిమా హాళ్లు, మాల్స్, పాఠశాలలు యథావిథిగా మూసివేయవచ్చని జగన్ అభిప్రాయపడ్డారు.
ఇక తెలంగాణ సిఎం కేసీఆర్.. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కోరారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు లాక్డౌన్ బాగా ఉపయోగపడుతోందన్నారు. అందువల్ల దీన్ని కనీసం మరో రెండు వారాలు కొనసాగించడం మంచిదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.