ఆరో విడత హరితహారం కార్యక్రమాన్నిప్రారంభించిన కేసీఆర్

ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌లో అల్లనేరేడు మొక్కను నాటి ప్రారంభించారు.అనంతరం 630 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్ ముఖ్యమంత్రి వెంటే ఉన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా హరిత హారం కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఆరో దశలో 30 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 34 శాఖల సమన్వయంతో రాష్ట్ర అటవీశాఖ ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికే ఎక్కడికక్కడ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామ గ్రామాన హరితహారం జోరుగా కొనసాగుతుంది.