మహిళా సంఘం సభ్యులకు కేసీఆర్ తీపి కబురు

లాక్ డౌన్ కారణంగా ప్రజలందరికి తీవ్ర ఇబ్బందులు ఎదురైనా సంగతి తెలిసిందే. కొంతమందైతే తినడానికి తిండి కూడా దొరకక ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళా సంఘంలోని ఒక్కో మహిళకు ‘మహిళా కొవిడ్-19 ఋణం’ కింద రూ.5 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఈ మేరకు మండలాల్లోని మహిళా సంఘాలవారికి అవగాహన కల్పించనున్నారు స్థానిక అధికారులు. తీసుకున్న రుణాలను నెలకు రూ.300 చొప్పున తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మరో పది రోజుల్లో అన్ని మహిళా సంఘాలకు రుణాలను అందించాలని నిర్ణయించారు. దీనిపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టారు.