Site icon TeluguMirchi.com

కేటీఆర్ కోసమే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాలపై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే ‘కేసీఆర్ దేష్ కీ నేత’ నినాదం ఢిల్లీలోనూ వినిపిస్తోంది. హైదరాబాద్ నుంచే దేశరాజకీయాలని ప్రభావితం చేస్తానని కేసీఆర్ కూడా తెలిపారు.

మరోవైపు, ప్రతిపక్షాలు కేసీఆర్ థర్డ్ ప్రంట్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ ఏర్పాటు చేయబోయే థర్డ్ ఫ్రంట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత ఆసక్తికరమైన కామెంట్ చేశారు. సీఎం కేసీఆర్ తన కొడుకు కేటీఆర్‌ను సీఎం చేయడానికే థర్డ్ ఫ్రంట్ పేరిట నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌ను సీఎం చేయాలని కుటుంబ సభ్యులు కేసీఆర్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పేరిట డ్రామాలాడుతున్నారని విమర్శించారు.

Exit mobile version