Site icon TeluguMirchi.com

రైతులకు కేసీఆర్ పిలుపు

తెలంగాణ రైతులంతా నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు ముందుకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. రైతులంతా వందకు వంద శాతం రైతుబంధు సాయం పొందాలన్నారు.

రాష్ట్రంలో నియంత్రిత పంటల సాగు అనే అంశంపై ఇవాళ ప్రగతిభవన్ లో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, అధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, నేల రకాలను పరిగణనలోకి తీసుకుని ఏ సీజన్ లో ఏం పండించాలి, ఏ ప్రాంతంలో ఏ పంటలు వేయాలనే విషయాలను శాస్త్రవేత్తలు నిర్ణయించారని, ఏ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందో అగ్రిబిజినెస్ డిపార్ట్ మెంట్ అధికారులు గుర్తించారని, ఈ మేరకు రైతులకు ప్రభుత్వం తగిన సూచనలు అందిస్తుందని కేసీఆర్ చెప్పారు.

Exit mobile version