Site icon TeluguMirchi.com

కావూరి కథ చెప్పారా.. ?

kavuri
రాష్ట్ర విభజన అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం జెడ్ స్వీడ్ తో పూర్తి చేయాలని యోచిస్తోంది. విభజన దిశగా కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి.. సీమాంధ్ర ప్రాంతం నుంచి ఎన్ని ఆందోళనలు వచ్చినా, ఆ ప్రాంత కేంద్ర మంత్రులు ఎన్ని హెచ్చరికలు చేసినా.. విభజన చేసి తిరుతామని ఢంక బజాయించి మరీ చెప్పింది. ఈ నేపథ్యంలో.. సీమాంధ్ర కేంద్ర మంత్రులకు విభజన ఖాయమని ఖరాఖండిగా చెప్పేశారు జీవోఎం సభ్యులు. దీంతో.. సమైక్యవాదాన్ని కాస్త పక్కన బెట్టి.. సీమాంధ్ర హక్కుల గురించి మాట్లాడటం  మొదలెట్టారు సీమాంధ్ర మంత్రులు. పైకి సమైక్యం తప్ప మరో ప్రతిపాదకు అంగీకరించేది లేదని చెప్పిన మంత్రులు.. లోలోపల మాత్రం జీవోఎంకు విజ్ఞప్తులు చేయడానికే పరితమయ్యారు.

ఈ లిస్టులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఒకరు. ఒకప్పుడు కరుడుగట్టిన సమైక్యవాదిగా వున్న కావూరి.. కేంద్ర మంత్రిగా పదివి చేపట్టినప్పటి నుంచి సమైక్యవాదానికి సైడ్ అయిపోయాడు. తీరా.. విభజన బిల్లును కేంద్ర కేబినేట్ ఆమోదముద్ర వేసిన అనంతరం.. మాకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదని వాపోతున్నారు. ఢిల్లీలో ఈరోజు(శనివారం) ప్రెస్ మీట్ పెట్టి మరీ.. విభజనపై ఆవేదన వ్యక్తం చే్శారు. తాము ఎంత తీవ్రంగా వాదించినప్పటికీ.. విభజనకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం కేబినెట్ భేటీలో ముసాయిదా బిల్లు పెట్టిందని ఆయన అన్నారు. గతంలో జీవోఎంని చాలాసార్లు కలిశామని, పలువురు పార్టీల నేతలను కూడా  చాలాసార్లు కలిసి పలు సూచనలు చేశామన్నారు. అయినప్పటికీ ప్రయోజనం శూన్యమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ తమని ఛీదరించుకునే ధోరణిలో చూసిందన్న కావూరి.. ఎప్పటికీ కాంగ్రెస్ విడనని పేర్కొనడం విశేషం. ఒకప్పుడు కేంద్ర మంత్రి పదవి దక్కనప్పుడు ఇదే కావూరి పార్టీ మారడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ప్రజల ఆకాంక్ష కోసం రాజీనామా చేయాలంటే.. కాకి కథలు చెబుతున్నారు కావూరి. ప్రజా  ప్రయోజనకాల కంటే.. స్వ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనడానికి ఇంతకంటే మరో  ఉదాహరణ అవసరం లేదేమో.. వాట్ యే డెడికేషన్ కావూరి.. !

Exit mobile version