నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విజయకేతనం ఎగరవేసింది. మొత్తం 824 ఓట్లలో 823 ఓట్లు పోల్ అవ్వగా.. ఇందులో కవితకు 728 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 ఓట్లు వచ్చాయి. పది ఓట్లు చెల్లబాటు కాలేదు. ముందు నుండి కవిత విజయం ఖరారు అని భావించిన నేతలు అనుకున్నట్లే కవిత విజయం సాధించడం తో సంబరాలు చేసుకుంటున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసి ఓటమి పాలైన కవిత… ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించి.. టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపారు. అక్టోబర్ 9న జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 823 మంది ప్రజాప్రతినిథులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇద్దరు ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేశారు.