కత్తి మహేష్ నోటికి హద్దు పద్దు లేకుండా పోతుంది. తన స్థాయి ఏంటో చూడకుండా, తన స్టామినా ఏంటో తెలుసుకోకుండా ఉన్నత శిఖరం వంటి పవన్ కళ్యాణ్‌ను కత్తి మహేష్ విమర్శిస్తున్నాడు. పవన్ ఫ్యాన్స్ ఇప్పటికే ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా మరోసారి తన నోటికి పని చెప్పాడు. కొత్త సంవత్సరం సందర్బంగా కేసీఆర్‌ను పవన్ కలవడం వారిద్దరి కలయిక అజ్ఞాతవాసి కోసం అంటూ కత్తి మహేష్ వ్యాఖ్యలు చేయడం తెల్సిందే.
తాజాగా మరోసారి కత్తి మహేష్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో రాణించేంత సత్తా, పరిజ్ఞానం పవన్‌కు లేదని, ఆయన రాజకీయాల్లో రాణించడం అసాధ్యం అంటూ చెప్పుకొచ్చాడు. తాను వచ్చే ఎన్నికల్లో పవన్‌పై పోటీ చేసేందుకు కూడా సిద్దం అని, మంచి పార్టీ తనకు టికెట్ ఇస్తే తప్పకుండా పవన్‌ను ఢీ కొట్టి విజయాన్ని అందుకుంటాను అంటూ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.