Site icon TeluguMirchi.com

కరోనాకష్టాలు తీరుస్తున్న ‘పేదలపెన్నిధి’ పాణ్యం MLA కాటసాని

కర్నూల్ జిల్లా, పాణ్యం నియోజక MLA కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గారు అంటే ఆ నియోజక వర్గ ప్రజలకి ఎనలేని అభిమానం..పేద, బడుగు, బలహీన వర్గ ప్రజలంటే కాటసాని కి కూడా అంతే ప్రేమ…. ‘దేహి’ అన్నవారికి ‘నాహి’ అనకుండా, ఎల్లవేళలా ఆపన్న హస్తం అందించే కాటసాని ని ఆ ప్రాంత ప్రజలు ‘పేదల పెన్నిధి’ అని అభిమానంతో పిలుచుకుంటారు.

ఆరు సార్లు, పాణ్యం నియోజకవర్గం నుంచి కాటసాని గారిని MLA గా గెలిపించటం ద్వారా ఆ ప్రాంత ప్రజలు తమ ప్రేమాభిమానాలు చాటారు. కాటసాని గారికి, పాణ్యంలో కుల, మత, ప్రాంతములతో సంబంధం లేకుండా అన్ని వర్గాలులో గట్టిపట్టు ఉందన్న మాట వాస్తవం.

ఈ కరోనా కష్టకాలంలో, ప్రస్తుతం మనముందున్న ప్రధాన బాధ్యత… ఈ లాక్ డౌన్ సమయంలో తెలుగు రాష్ట్రాలలో “మర్కజ్ ప్రార్థనలు” నుంచి తిరిగి వచ్చిన వారికి కరోనా పరీక్ష చెయ్యించటం, ఈ విషయంలో చొరవ తీసుకొని, వారికి ఉన్న అపోహలను, భయాలను తొలగించి కరోనా పరీక్షలు జరిగేటట్టు చర్యలు తీసుకొన్నకాటసాని గారిని పొగడకుండా ఉండలేం.

కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటినుండి తన నియోజకవర్గంలో కలతిరిగి, ప్రజల కష్టసుఖాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తాను చేతలమనిషి ని అనిపించుకుంటున్నారు. ఆయన సేవాకార్యక్రమాలు మచ్చుకు కొన్ని……

1) కరోనా వైరస్ నివారణలో భాగంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కర్నూలు నగరం నంద్యాల చెక్ పోస్టు తాత్కాలిక రైతు మార్కెట్ లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, రైతు కూలీలకు, పారిశుధ్య కార్మికులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు పాణ్యం నియోజకవర్గంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసారు…

2) శ్రీ ఉమామహేశ్వర నిత్యాన్నదాన సంస్థ యాగంటి క్షేత్రం నందు ఆ సంస్థ వ్యవస్థాపకులు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు యాగంటి ఆలయం మాజీ చైర్మన్ దొనపాటి యాగంటి రెడ్డి చేతుల మీదుగా కరోనా నిరాశ్రయులకు కోసం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.

3) 144వ రేషన్ పంపిణీ సెంటర్ లో ప్రజలందరూ రద్ధిగా ఉండడం వలన…వార్డులోని ప్రజలందరికి అందుబాటులో ఉండేది ఈ రేషన్ సెంటర్ కాబట్టి… వేరే రేషన్ సెంటర్ వారికి కూడా మీరు రేషన్ పంపిణీ చెయ్యండి అని డీలర్ కు సూచించారు… మీకు కావాల్సినంత రేషన్ ను ASO గారితో మాట్లాడి మీకు అందేవిధంగా చేస్తాను అని డీలర్ కు భరోసా ఇచ్చారు….అదేవిధంగా అందరు సామాజిక దూరాన్ని పాటిస్తూ స్వచ్చందంగా… బాద్యత కలిగి నడుచుకోవాలని సూచించారు…

4) పార్థసారథి టవర్స్ దగ్గర్లో ఉన్న కొట్టాలలో నివాసం ఉంటున్న ప్రజలకు నీటి సరఫరా అందడం లేదని స్థానికులు ఎమ్యెల్యే గారికి సమస్యను తెలపగా… మునిసిపల్ కమీషనర్ శ్రీ.రవీంద్రబాబు గారు కూడా అక్కడే ఉండడంతో విషయం తెలిపి వారందరికీ వెంటనే నీటి సరఫరా చేయాలని ఆదేశించారు మన కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు…

5) శ్రీ.కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి చేతుల మీద కొంతమంది వృద్దులకు (ఒక్కొక్కరికి 2250/- రూ.లచొప్పున) పెన్షన్లు పంపిణీ చేశారు…

Exit mobile version