కర్నాటక సెగ…మధ్యప్రదేశ్ ను తాకనుందా…!

కర్ణాటక రాజకీయ సంక్షోభంతో మద్యప్రదేశ్ లో అప్రమత్తమైంది కాంగ్రెస్. ఇక్కడ కూడ కాంగ్రెస్ కి అరకొర మెజార్టీ ఉండటం కమలదళం కూడ ఇక్కడ కన్నేయడంతో అప్రమత్తమైంది హస్తం పార్టీ. వెంటనే పార్టీ ట్రబుల్ షూటర్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ ను మద్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు పంపింది. తమకు మద్దతు ఇస్తున్న ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు జారిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ముఖ్యమంత్రి కమల్ నాద్ కు పార్టీ నాయకత్వం సందేశం పంపించింది.

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి 114 మంది ఎమ్మెల్యేలు ఉండగా,పూర్తి మెజార్టీకి 115 మంది అవసరం. ఇక బిఎస్పీ నుంచి ఇద్దరు, ఎస్పీ నుంచి ఒకరు, ముగ్గురు ఇండిపెండంట్ల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోంది.కాగా బీజేపీకి 109 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మధ్యప్రదేశ్ పెద్ద రాష్ట్రం కావడం,ఇక్కడ బీజేపీకి మంచి పట్టుండటంతో కాంగ్రెస్ పరిస్థితి దినదిన గండం గానే మారింది.