Site icon TeluguMirchi.com

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్..


కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. అలాగే ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ కూడా ప్రమాణం చేశారు. వీరితో పాటు మరో ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్ తవార్ చంద్ గెహ్లాట్ వారిచేత ప్రమాణం చేయించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్డున ఖర్గే, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్, బిహార్ సీఎం నితీశ్ కుమార్, చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుక్విందర్ సింగ్, బీహార్ డీప్యూటీ సీఎం తేజస్వియాదవ్, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, నటుడు, మక్కల్ నీది మయం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ తదితరులు హాజరయ్యారు.

Exit mobile version