కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకొని ప్రపంచ ప్రసిద్ధి చెందిన తూర్పు నావికాదళం కళాకారుల బ్యాండ్ ఆకట్టుకుంది. విశాఖ నగర ప్రజల కోసం పిఠాపురం కాలనీలోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన నావి బ్యాండ్’ నగర ప్రజలను మంత్రముగ్ధులను చేసింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంగీత వాయిద్యాల మీద సంగీతం అందించడంతో పాటు దేశభక్తి గీతాలు మంత్ర ముగ్ధుల్ని చేసింది.