రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా సమంత ఊ కొడతావా సాంగ్ దుమ్ములేపుతుంది. సినీ స్టార్స్ , అభిమానులు , సినీ ప్రేక్షకులే కాదు రాజకీయ నేతలు సైతం పలు ఈవెంట్ లలో ఈ సాంగ్ కు డాన్సులు వేస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఊ కొడతావా సాంగ్ అదిరిపోయే స్టెప్స్ వేసి ఆకట్టుకున్నాడు.
ఊఊ అంటావా మావ పాటతో పాటు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై రూపొందించిన పాటలకు కరణం ధర్మశ్రీ లయబద్ధంగా డ్యాన్స్ చేశారు. తాను డ్యాన్స్ చేయడమే కాకుండా.. పార్టీ కార్యకర్తలను కూడా ఉత్సాహపరుస్తూ డ్యాన్స్ చేయించారు. పిక్నిక్ మాదిరిగా జరిగిన ఈ కార్యక్రమంలో చోడవరం మండలంలోని అన్ని పంచాయతీల నుంచి గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మండల జెడ్పీటీసీలు, ఎంపీపీ, వివిధ శాఖల రాష్ట్రల కార్పోరేషన్ డైరెక్టర్లు, వివిధ శాఖల చైర్మన్‌లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.