తునిలో కాపుగర్జన సభలో కాపునాడు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అనూహ్యంగా రైలు, రాస్తా రోకోలకు పిలుపునివ్వడంతో కోల్కతా-జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విజయవాడ-విశాఖపట్నం రైల్వే మార్గంలో రైళ్లను ఆపివేశారు. తుని రైల్వే స్టేషన్లో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్కు, తుని రూరల్ పోలీస్ స్టేషన్కు ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. కాపు గర్జన తీవ్ర రూపం దాలుస్తుందని ఇంటలిజెన్స్ వర్గాలు కూడా అంచనా వేయలేకపోయాయి. పక్క జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను పంపిస్తున్నారు.