Site icon TeluguMirchi.com

కన్నా లక్ష్మీనారాయణ కోడలి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు రెండు రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే.హైదరాబాద్ మాదాపూర్‌లోని మీనాక్షి టవర్స్‌లో స్నేహితురాలి ఇంటికి వెళ్లిన ఆమె.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెను హుటాహుటిన రాయదుర్గం ఏఐజీ ఆస్పత్రికి తరలించగా.. ఆమెను పరిశీలించిన డాక్టర్లు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్థారించారు. కాగా ఈమె మరణంపై అనేక అనుమానులు వ్యక్తం కాగా ఈరోజు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది.

ఉస్మానియా ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో సుహారిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. శరీరంలో ఎలాంటి గాయాలు కనిపించలేదు. దీంతో ఆమె గుండె పోటుతోనే మరణించారని ప్రాథమికంగా తేల్చారు. ఆమె మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని డాక్టర్లు తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్టు రావడానికి మరో 15 రోజుల సమయం పడుతుంది. సుహారిక మృతదేహాన్ని ఆమె భర్త ఫణీంద్ర, ఇతర కుటుంబ సభ్యులకు అప్పగించామని డాక్టర్లు తెలిపారు.

Exit mobile version