ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు విపరీతం గా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని దేవాలయాలను క్వారంటైన్ సెంటర్లుగా ఏర్పటు చేయాలనీ జగన్ నిర్ణయం తీసుకోబోతున్నాడనే వార్తలు బయటకు రావడం తో బీజేపీ నేత కన్నామండిపడ్డారు. జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల్ని ఆయన తప్పు పట్టారు. ప్రభుత్వం వెంటనే ఈ ఆలోచనల్ని విరమించుకోవాలని కన్నా డిమాండ్ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 252కు చేరాయి. దీంతో పాజిటివ్ వచ్చిన వ్యక్తులను వారి కుటుంబ సభ్యులు, బంధువులు, వారిని కలిసిన వారందరినీ క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు అధికారులు. అక్కడ జనాలు నిండిపోతుండడంతో దేవాలయాలను కూడా క్వారంటైన్ సెంటర్లుగా ఉపయోగించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో ముందుగా చిత్తూరులోని శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాల్లో క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటును పరిశీలించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.