కనగరాజ్‌ క్వారంటైన్‌ అవసరం లేదా ?


కరోనా నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని టీడీపీ సీనియర్‌నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ విమర్శించారు. ఎస్‌ఈసీగా నియమితులైన మద్రాస్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కనగరాజ్‌ చెన్నై నుంచి వచ్చారు. ఆయనకు క్వారంటైన్‌ అక్కర్లేదా’ అని ప్రశ్నించారు.

ఎస్‌ఈసీగా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్స్‌ జారీచేసిన విషయం తెలిసిందే. ఈ పదవిలో ఎవరిని నియమిస్తారన్న విషయాన్ని గోప్యంగా ఉంచింది. శనివారం జస్టిస్‌ కనగరాజ్‌ బాధ్యతలు చేపట్టే సమయంలోనే పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.