కేటీఆర్-హరీష్’రావుల మధ్య విభేదాలు ?!

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింట కందిరీగ తుట్టెను కదిపాడు ఎమ్మెల్యే కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి. కేసీఆర్ తర్వాత స్థానం ఎవరిది ? అంటూ టీఆర్ ఎస్ వర్గాల్లోనూ అప్పుడప్పుడు చర్చకు దారితీస్తుంది. ఐతే, కేసీఆర్ ఉండగా దీనిపై చర్చ అనవసరమని చాలామంది టీఆర్ ఎస్ నేతలు అంటుంటారు. ఇప్పటికైతే కేటీఆర్-హరీష్’రావుల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొంటారు.

ఇప్పటికే కేటీఆర్-హరీష్’రావుల మధ్య విభేదాలు ఉన్నాయని కోమటి రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇందుకు ఓ సాక్ష్యాన్ని కూడా చూపిస్తున్నారు. ఇటీవలే హరీష్ ఇంట్లో జరిగిన ఫంక్షన్’కి కేటీఆర్ డుమ్మా కొట్టి బెంగళూరులో సినిమాకు వెళ్లొచ్చారని ఆరోపించారు. రేపు కేసీఆర్ లేకుండా కేటీఆర్-హరీష్ లు రొడ్డెక్కి మరీ కొట్టుకొంటారని కోమటి రెడ్డి అన్నారు. మరీ.. దీనిపై కేటీఆర్, హరీష్ లు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.