Site icon TeluguMirchi.com

కమల్ హాసన్ పార్టీ.. దక్షిణాది గొంతుక

సినీనటుడు కమల్ హాసన్ కొత్త పార్టీ పెట్టారు. తమిళనాడులో పక్కా తమిళ పేరుతోనే ఆయన పార్టీ ‘మక్కళ్ నీతి మయ్యమ్’ అంటూ తన పార్టీని స్థాపించారు తెలుపు రంగు జెండాలో ఎరుపు, నలుపు రంగు మిళితమైన ఆరు చేతులతో పార్టీ జెండాను కమల్‌ ఆవిష్కరించారు.

అయితే తన పార్టీ గుర్తులో చేయి చేయి కలిపి ఉన్న గుర్తుకు అర్థమేంటో కమల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ‘అందరూ ‘మయ్యమ్‌’ అంటే ఏంటి?నేను లెఫ్ట్‌ పార్టీకి మద్దతిస్తానా? లేక రైట్‌ పార్టీకి మద్దతిస్తానా? అని అడుగుతున్నారు. ఆ రెండిట్లో ఏదీ కాదు. అందుకే మయ్యమ్‌ అని పెట్టాను. మయ్యం అంటే సెంటర్‌ అని అర్థం. ఇక పార్టీ గుర్తులో ఉన్న ఆరు చేతులు ఆరు రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతమైన అండామాన్‌ అండ్‌ నికోబార్‌ దీవులు. మధ్యలో ఉన్న నక్షత్రం గుర్తు ప్రజలు’ వివరణ ఇచ్చారు కమల్ . దిని బట్టి ఆరు దక్షిణాది రాష్ట్రాల గొంతుకను కమల్ వినించబోతున్నారని అర్ధం చేసుకోవచ్చు.

Exit mobile version