నన్ను చంపుతానంటున్నారు.. అయినా పోరాడుతా

తమిళనాడు రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నయో తల పండిన రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పలేక పోతున్నారు. ఒక వైపు పలనిస్వామి ప్రభుత్వం పడిపోయే ప్రమాదంలో ఉంది. అన్నాడీఎంకే రెండుగా విడిపోయిన నేపథ్యంలో ఆ పార్టీకి అధికారంలో ఉండే బలం లేదని డీఎంకే అధినేత స్టాలిన్‌ ఆందోళనలు చేస్తున్నాడు. వెంటనే పలనిస్వామి ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గాలని స్టాలిన్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం ఏ సమయంలోనైనా పడిపోవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో రజినీకాంత్‌, కమల్‌ హాసన్‌లు చేస్తున్న రాజకీయ సందడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తమిళనాడు రాజకీయాల్లో రజినీకాంత్‌ ఎంట్రీ దాదాపుగా ఖరారు అయ్యింది. కొత్త పార్టీతో రజినీకాంత్‌ ప్రజ ముందు నిల్చునేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ సమయంలోనే యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ కూడా రాజకీయ వ్యాఖ్యలు చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అన్నాడీఎంకే పార్టీ నుండి శశికళ బయటకు వెళ్లడం మంచి పరిణామం అని, అయితే తమిళనాట ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అన్నాడు.

తాను రాజకీయాల గురించి స్పందిస్తూ ఉంటే కొందరు చంపేస్తామంటూ బిదిరిస్తున్నారు. తనను ఎంత బెదిరించినా కూడా కాస్త ఎక్కువగానే రాజకీయాల గురించి మాట్లాడుతా, నాయకులను విమర్శిస్తా. అంతే తప్ప తాను భయపడిపోయి రాజకీయాలకు దూరంగా ఉండను అంటూ చెప్పుకొచ్చాడు.