కేంద్ర ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాలతో పాటూ దేశవ్యాప్తంగా కొన్ని రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చింది. ఏపీలో ఆరు, తెలంగాణలో రెండు నమోదిత గుర్తింపులేని రాజకీయ పార్టీలను ఈసీఐ జాబితా నుంచి తొలగించింది.
అయితే ఈసీ కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీని కూడా క్రియాశీలకంగా లేని పార్టీల జాబితాలో చేర్చింది. యాక్టివ్‌గా లేని పార్టీలకు కామన్ సింబల్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. 2008లోనే ప్రజా శాంతి పార్టీని రిజిస్టర్ చేయించారు. ఆ పార్టీకి హెలికాప్టర్ గుర్తును ఈసీ కేటాయించింది. 2009 ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ తరపున 11 మంది పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో కూడా ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. కేఏ పాల్ నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేయగా, అందరూ ఓడిపోయారు.