Site icon TeluguMirchi.com

జూనియర్ కోసమే రాజీనామా!

harikrishnaటీడీపీ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ … హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని తప్పుపట్టారు. నాలుగేళ్ల కాలంలో రాజ్యసభలో ఎన్నడూ మాట్లాడని హరికృష్ణ ఇప్పుడు కొత్త కథలు విన్పిస్తున్నారని కేఈ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను పైకి తీసుకొచ్చేందుకే హరికృష్ణ ఈ కొత్త డ్రామాకి తెరతీశారని కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version