టీడీపీ కి గట్టి షాక్

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు గెలుపోటములు సహజమని, వాటికి సిద్ధపడి ముందుకు వెళ్లాలన్నారు. ఇందుకు విరుద్ధంగా ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని పార్టీ తీసుకున్న నిర్ణయం మనస్తాపం కలిగించిందని తెలిపారు.

పార్టీకి సంబంధించిన రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఇష్టం లేక తన పదవికి రాజీనామా చేశానన్నారు. నియోజకవర్గంలో పార్టీ నాయకుడిగా, కార్యకర్తలకు అండగా ఉంటానని అన్నారు. TDP క్యాడర్‌ చాలా చోట్ల గెలిచే అవకాశాలున్న తరుణంలో పార్టీ ఈ విధంగా నిర్ణయం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.