జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం షురూ?

ntr
టీడీపీ తరపున ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమైనట్లు సమాచారం. దానికి సంబంధించి రేపు (గురువారం) మీడియాకు అధికారికంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది. మరోవైపు ప్రచారం కోసం రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారని వినికిడి. ఓ వైపు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి టీడీపీ నుంచి పోటీ చేస్తున్న బాలకృష్ణ, అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు స్టార్ క్యాంపైనర్లుగా మారి టీడీపీికి తమదైన ప్రచారం చేస్తున్నారు. అలాంటప్పుడు తాను కూడా వెళ్ళడమే ఉత్తమమని భావించిన జూనియర్ ఇక ప్రచారాన్ని షురూ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఏయే నియోజక వర్గాల్లో ప్రచారం చేస్తారు… రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండాలన్న అంశంపై రేపే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.