Site icon TeluguMirchi.com

నిర్ణయం జరగాల్సింది ఢిల్లీ లో కాదు !

jpతెలుగు ప్రజల భవితవ్యాన్ని ఇక్కడి ప్రజలే నిర్ణయించుకోవాలి కాని, ఢిల్లీ లో తేల్చడానికి వారెవరని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రశ్నించారు . రాష్ట్ర ఉనికే ప్రశ్నార్ధకమవుతున్నప్పుడు , రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయాలు చేస్తారా అని జయప్రకాష్ ప్రశ్నించారు. తాజాగా మీడియా తో మాట్లాడుతూ .. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించారని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజల అంగీకారం లేకుండా కుట్రపూరిత ఆలోచనలతో రాష్ట్రాన్ని విభజిస్తున్నారని మండిపడ్డారు. విభజన నిర్ణయంతో కోస్తాంధ్ర గుండెకు గాయమైందన్నారు. తెలుగు ప్రజల మనోభావాలను శాసనసభలో వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Exit mobile version