Site icon TeluguMirchi.com

ఓటమికి బాధ్యత నాదే: జేపీ

jp
పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఓటమికి నైతిక బాధ్యత తనదేనని అన్నారు లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ అన్నారు. జాతీయ కార్యవర్గం నిర్ణయంపై తన రాజీనామా ఆధారపడి ఉందన్నారు. లోక్‌సత్తా పార్టీ రాజకీయాల నుంచి ఎక్కడికీ పారిపోదన్నారు. కేంద్రంలో సుస్థిరపాలనకు ప్రజలు అవకాశం ఇచ్చారని, కొత్త ప్రభుత్వాలు యువత ఆకాంక్ష నెరవేర్చేందుకు ప్రయత్నించాలన్నారు. యువత భవిష్యత్ కోసం తీసుకునే చర్యలను చేతల్లో చూపించాలన్నారు. 1971 తర్వాత ప్రజలు స్పష్టమైన అజెండా ఇవ్వడం ఇదే తొలిసారి అన్న జేపీ, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉందన్నారు.

Exit mobile version