Site icon TeluguMirchi.com

పవన్ కళ్యాణ్ జేఎఫ్‌సీ లోగో ఇదిగో


ఆర్థికవేత్తలు, ప్రభుత్వ మాజీ అధికారులు, విద్యా వేత్తలు, సామాజిక, రాజ‌కీయ నాయ‌కులు తదిత‌రుల‌తో జేఎఫ్‌సీని ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. జేఎఫ్‌సీ ఏ వ్యక్తిగత, రాజకీయ స్వార్థం, వివక్ష లేకుండా ఏపీ పునర్విభజన హామీలను విశ్లేషించి నివేదిక అందిస్తుందని చెప్పారు. అలాగే, జాయింట్ పొలిటికల్ యాక్షన్ కమిటీ కూడా ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. జేఎఫ్‌సీ అందించిన నివేదిక ప్రకారం జాయింట్ పొలిటికల్ యాక్షన్ కమిటీ రాజకీయ కార్యాచరణను రూపొందిస్తుందని చెప్పారు.

ఈ విషయంపై ఇప్పటికే ఆయన లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో పాటు పలువురితో చర్చలు జరిపారు. కాగా, ఈ రోజు ఆయన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ లోగో విడుద‌ల చేశారు. తన ట్విట్ట‌ర్ ఖాతాలో దీన్ని పోస్ట్ చేశారు పవన. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య జేఎఫ్‌సీ అనే లోగోనే డిజైన్ చేశారు.

Exit mobile version