టీడీపీ నేతలు, కార్యకర్తలను యుద్ధం చేయాలంటూ చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఏపీ గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. కుప్పం ప్రజల తిరుగుబాటుకు భయపడి పారిపోయిన వ్యక్తి చంద్రబాబు.. కార్యకర్తలను మాత్రం బలి చేయాలని చూస్తున్నాడని దుయ్యబట్టారు. డీబీటి ద్వారా తాము లక్షా 70 వేల కోట్లు నేరుగా ప్రజలకు అందించామని పేర్కొన్నారు. అవినీతి కేసులు విచారణ జరగనీయకుండా స్టే తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు.. దమ్ముంటే వాటిపై విచారణ జరిపించుకోవాలన్నారు.